ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలను ఆయన కలిసి, అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.