సత్యసాయి: కియా పోలీస్ స్టేషన్ను ఎస్పీ సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేశారు. మహిళల ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు, అక్రమ మద్యం, ఇసుక రవాణా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.