WNP: రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ.. చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. పెబ్బేరు సుభాశ్ చౌరస్తాలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని ఎంఐఎం మండల అధ్యక్షుడు ఎండీ ఆఫ్రోజ్ సందర్శించి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.