NRPT: కృష్ణ మండలం హిందూపూర్ నుంచి కున్సి వెళ్లే మార్గంలోని రైల్వే బ్రిడ్జి కింద రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. భారీ గుంతల వల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.