చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. వైద్య భాషలో దీనిని ‘ఒనికోఫేజియా’ అంటారు. ఇలా గోళ్లు కొరకడం వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. గోళ్లలో ఉండే మురికి, బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది దంతాల ఆకారాన్ని దెబ్బతీయడమే కాకుండా, చిగుళ్లకు కూడా నష్టం కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.