తమన్నాపై తాను చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని సీనియర్ నటుడు అన్నూ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమె తెల్లగా ఉంటుందని హిందీలో అన్నందుకు నన్ను ట్రోల్ చేశారు. అదే ఇంగ్లీష్‌లో ‘Milk Body’ అంటే ఎవరికీ సమస్య ఉండకపోయేదేమో’ అని పేర్కొన్నాడు. తన ఉద్దేశం తప్పు కాదని, ఒకవేళ తమన్నా బాధపడితే ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమని స్పష్టం చేశాడు.