BDK: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవని పురస్కరించుకుని ఇల్లందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం యొక్క ప్రాముఖ్యతను చర్చించుకున్నారు. అలాగే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.