KMR: బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ బీజేపీ బూత్ కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బూత్ కమిటీ అధ్యక్షునిగా వెంకటి, ఉపాధ్యక్షుడిగా తుమ్మ మహేష్, కార్యదర్శిగా లింగారెడ్డి, కమ్మరి నరహరి చారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు లింగరాజు రాజు పార్టీ నాయకులున్నారు.