MDCL: ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద టాయిలెట్లు ఎక్కడంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాప్ వద్ద కుర్చీలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ మరుగుదొడ్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి, మొబైల్, శాశ్వత టాయిలెట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.