ATP: గుత్తి మండల ప్రజలు స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తెలిపారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇండ్లలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రిప్పు పైపులు, పాత పుస్తకాలు తదితర వ్యర్థాలను గ్రామానికి స్వచ్ఛ రథం వచ్చినప్పుడు అందజేయాలన్నారు. ఆ మేరకు ఆ వస్తువుల విలువను బట్టి నిత్యవసర సరుకులను అందజేస్తామన్నారు.