పశ్చిమ బెంగాల్లో నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగిపోయే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ పోలింగ్‌తో స్పష్టమైందని తెలిపారు. తొలి దశలో జరిగిన 152 సీట్లలో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.