KMR: జిల్లా అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి పదోన్నతిపై బదిలీ కావడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ‘కిడ్స్ విత్ ఖాకీ’, రోడ్డు భద్రత, వరద బాధితుల రక్షణలో ఆమె చూపిన సాహసం ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.