SDPT: ఎన్సీడీ స్క్రీనింగ్ (అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు) జిల్లా వ్యాప్తంగా పగడ్బందీగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ కే.హైమావతి ఆదేశించారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్యులు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించి జిల్లాలో నిర్వహించిన ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులపై సమీక్ష నిర్వహించర.