ముంబైపై విజయం అనంతరం CSK స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టు కోసమే ఆడితే సెంచరీ రివార్డ్‌గా లభించిందని తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని స్పష్టం చేశాడు. తనకున్న అనుభవంతో ఆటను అర్థం చేసుకున్నానని అన్నాడు. తమది యువ జట్టు.. కానీ వరుసగా మూడు ఓటముల తర్వాత తమ టీమ్ చూపించిన పోరాటం అద్భుతం అని కొనియాడాడు.