HNK: ఐనవోలు మండల కేంద్రానికి చెందిన నల్లబెట్ట యాకయ్య సైకిల్‌పై రాంనగర్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు సైకిల్‌పై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.