KKD: జనన గణన కార్యక్రమంలో ప్రజలందరూ స్వీయ నమోదు చేసుకోవాలని సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య కోరారు. గురువారం బళ్ల మార్కెట్ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ‘జనన గణన 2027’ స్వయం నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గణాంక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.