GDWL: తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ గద్వాల ఆర్టీసీ డీపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మధ్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ప్రయాణికులను ప్రైవేటు బస్సులలో గమ్యాలకు చేరుస్తున్నారు. ఆందోళనను అడ్డుకునేందుకు డీపో వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.