నిర్మల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛానీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉదయం నుంచే ఆర్టీసీ డిపో ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.