SDPT: పట్టణానికి చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం రాష్ట్రస్థాయి ‘బాలసాహితిమిత్ర’ అవార్డుకు ఎంపికయ్యారు. బాలలచే రచనలు చేయించి, పుస్తక రూపంలో తెచ్చినందుకు గాను ఈ పురస్కారం దక్కింది. మే 4న హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో జరిగే సమ్మేళనంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు సంస్థ ప్రధాన కార్య దర్శి చెన్నయ్య తెలిపారు.