అన్నమయ్య: వాల్మీపురంలోని జార్రపల్లె వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ దామోదరరెడ్డి కరెంట్ షాక్కు గురై స్తంభం పై నుంచి కిందపడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.