JGL: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయానికి వచ్చిన ఆదాయం వివరాలను ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.1,73,922, ప్రసాదాల ద్వారా రూ.97,000, అన్నదానం ద్వారా రూ.54,640 ఆదాయం లభించింది. మొత్తం రోజువారీ ఆదాయం రూ.3,25,562గా నమోదు అయింది. భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.