పాక్‌లోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనుకున్న 92 మంది భారత భక్తులకు అక్కడి ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఖల్సా సజ్నా దివస్ వేడుకల్లో భాగంగా గురుద్వారా పంజా సాహిబ్‌ను దర్శించుకునేందుకు వారంతా సిద్ధమవగా.. వీసాలు నిరాకరించినట్లు ఖల్సా వాక్స్ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది. కాగా ముందు వీసాలు ఇచ్చి.. ఆపై వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది.