HYD: మాదాపూర్లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఆగిన గోస శ్యామ్రాజ్అనే వ్యక్తిని బెంజ్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.