TG: లక్ష కోట్లను కాళేశ్వరంలో ముంచిన కేసీఆర్ను ఉరి వేసినా తప్పు లేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోరీ కట్టామని తెలిపారు. 2029లో తేల్చుకుందామని.. దమ్ముంటే రండన్నారు. కార్యకర్తల సాక్షిగా ఇదే తన సవాల్ అని అన్నారు. DS, YSR లాగే తాను, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.