NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి రైతు వేదికలో శాస్త్రవేత్తలు ఇండోరియా, కీర్తికల ఆధ్వర్యంలో ‘మేరా గావ్ మేరా గౌరవ్’ నిర్వహించారు. యూరియా తగ్గించి సమతుల్య ఎరువులతో భూమిని రక్షించాలని రైతులకు సూచించారు. డీఏవో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, సబ్సిడీపై పచ్చిరొట్టె, జీవన ఎరువులు అందిస్తామన్నారు.