వనపర్తి డిపో నుంచి వివిధ రూట్లలో మొత్తం 19 బస్సులు నడిపినట్లు డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఇందులో 10 ఆర్టీసీ, 9 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్కు 6 బస్సులు, ఇతర ప్రాంతాలకు రూటుకు రెండు చొప్పున నడిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన వెల్లడించారు.