PLD: రొంపిచర్ల జడ్పీ హైస్కూల్లో ఈనెల 26న పల్నాడు జిల్లా బేస్బాల్ ఎంపికలు జరగనున్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా ట్రయల్స్ ఉంటాయి. 01.11.2011 నుంచి 31.12.2013 మధ్య పుట్టిన వారు అర్హులని నిర్వాహకులు తెలిపారు. పోటీలకు వచ్చేవారు ఆధార్, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఇక్కడ ఎంపికైన వారు వచ్చే నెల 4 నుంచి 6 వరకు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు.