‘చాంద్ మేరా దిల్’ చిత్రంలో నటి అనన్య పాండే చేసిన భరతనాట్యం ప్రదర్శనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె డాన్స్ స్టెప్పులు సంప్రదాయ నాట్యశైలికి భిన్నంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సీన్ క్లిప్ వైరల్ అవ్వడంతో, హీరోయిన్‌తో పాటు దర్శకుడు వివేక్ సోని కూడా మీమ్స్, విమర్శలను ఎదుర్కొంటున్నారు.