AP: ‘స్వర్ణాంధ్ర విజన్ – 2047’లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖపై వివిధ అంశాల వివరాలను అధికారులను అడిగి CM తెలుసుకున్నారు. సాగుపై ఎల్నినో ప్రభావం, సాగునీరు, విత్తన పంపిణీపై చర్చించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్న, అధికారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.