KNR: చొప్పదండి మండలం ఆర్నకొండలో మంగళవారం గ్రామ బాలల సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని, నష్టదాయకమని వివరించారు. ఆడపిల్లలకు 18 సం., మగ పిల్లలకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి రాజశేఖర్, పాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.