GDWL: కేటి దొడ్డి మండలం కొండాపురంలో మంగళవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మండల స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు ముఖ్య అతిథిగా హాజరై, సవరణల ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీపాద రెడ్డి, ముంగిలి వీరేష్, ఎర్ర భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.