KMM: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. 16 ఏళ్ల మానసిక వికలాంగ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు బత్తుల చంద్రశేఖర్‌ను ఖమ్మం ఒకటో అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు నిందితుడికి జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు జరిమానా విధించింది.