NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో ఈ నెల 28న జరగాల్సిన MBA/MHA/MED 3వ, MBA/MED 4వ సెమిస్టర్ & ఫైనలియర్ పరీక్షలు రేపు జరగనున్నాయి. 28న బక్రీద్ పర్వదినం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున, ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షలు బుధవారం(మే 27) ఉంటాయని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటన విడుదల చేశారు.