NLG: ప్రస్తుతం ఎండలు, వడగాలులు తీవ్రంగా వీస్తున్నందున కట్టంగూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కట్టంగూర్ ఎస్సై రవీందర్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ప్రజలు బయటకు రావద్దన్నారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి నీరు, మజ్జిగ, కొబ్బరినీరు, ఓఆర్ఎస్ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.