ATP: గుంతకల్లు పట్టణంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని హంపిరెడ్డి భవనంలో మీడియాతో మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. పాఠశాలలో కనీస సదుపాయాలు లేకున్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.