RR: ముందు వడ్లు కొనాలని డిమాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుంచి తొలగించడంపై ఓబీసీ మోర్చా నేత బోయిని మహేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్న ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ అశోక్‌ను విధుల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.