HNK: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఎలు) కీలక పాత్ర పోషించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గ BLOకు హనుమకొండలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్, ఎన్యుమరేషన్, కొత్త ఓటర్ల నమోదు వంటి పనుల్లో నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.