MLG: జిల్లా పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ‘ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’లో క్రియేటర్లు పాల్గొనాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత వంటి ప్రాంతాలపై 4K రీల్స్‌ను ఈ నెల 30 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలని, విజేతలకు రూ.21 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.