NGKL: జిల్లా పోలీస్ శాఖలో మహిళా అధికారులకు ప్రాధాన్యం కల్పిస్తూ ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఉమెన్స్ వీక్ సందర్భంగా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమెన్ ఎస్సై రమాదేవిని ఉరుకొండ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నియమించారు.