కోనసీమ: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాధితునికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించి మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. కె.గంగవరం మండలం యర్రపోతవరంకి చెందిన అనసూరి గోవిందు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అతని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి మంగళవారం రూ.25 వేల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు.