NRPT: నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 18 మంది బాధితులు ఫోన్ చేసి సమస్యలు తెలియజేశారు. బెల్టు దుకాణాలు మూసివేయడం, భూ తగాదాలు, గ్రామాల్లో పెట్రోలింగ్ పెంచడం వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.