VSP: పద్మనాభం కొండపై వెలసిన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మంగళవారం స్వామివారిని దర్శించుకున్న ఆయన, భక్తుల కోసం ఘాట్ రోడ్డు నిర్మించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును అభినందించారు. కొండపై కళ్యాణమండపం, భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.