SRPT: సైక్లింగ్ శారీరక దృఢత్వానికే కాకుండా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి తోడ్పడుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తిరుమలగిరి మండల సమైక్య ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, స్నేహా సంఘాల బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.