TPT: వరదయ్యపాలెంలో టీడీపీ క్లస్టర్ స్థాయి మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జ్ నిర్మల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర స్థాయి మహానాడుకు ముందు నియోజకవర్గ వ్యాప్తంగా క్లస్టర్ స్థాయి మహానాడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.