MDCL: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సభ్యునిగా మోతే శోభన్ రెడ్డి నియామకంపై ఉప్పల్ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి సముచిత గుర్తింపు దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యమ యోధులకు ప్రభుత్వం నుంచి మరింత గౌరవం, సంక్షేమ పథకాలు అందేలా బోర్డు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.