TG: కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసిన కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. రైతులకు నష్టం జరిగే ఏ చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని చెప్పారు.