అనకాపల్లి మండలం తుంపాల మేజర్ పంచాయతీలో రూ. 30 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు ఎంపీపీ గొర్లి సూరిబాబు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ నుంచి మంజూరు చేసిన ఈ నిధులతో గవరపేట వీధి రామాలయం నుంచి శివాలయం వరకు, రామాలయం నుంచి కొణతాల దిబ్బ వరకు సీసీ రోడ్లు కల్వర్టు నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.