PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.