ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. సినీ పరిశ్రమ పరిస్థితులపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరింది. 15 నిమిషాల సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇప్పటికే సమావేశమయ్యారు. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ సమస్యలపై ఆయనతో చర్చించారు.