TG: బీఆర్ఎస్ హయాంలో మహిళల సంక్షేమంపై ఆలోచించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. తాము మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చామన్నారు. 8 వేల మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రెండున్నరేళ్లలోనే రూ.66 వేల కోట్ల బ్యాంకు రుణాలను మహిళలకు ఇప్పించామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతల దుష్ర్పచారాలు అసహనం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.